Maoist Encounter in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.. మంగళవారం అల్లూరి సీతారామా రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా, ఆయన భార్య హేమ సహా ఆరుగురు మృతిచెందగా.. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ రోజు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.. తాజా ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది.. ఇవాళ కూడా ఎన్‌కౌంటర్ జరిగిందని.. అందులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారని ధృవీకరించారు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా.. మృతుల్లో మావోయిస్టు నేత దేవ్‌జీ ఉన్నట్టుగా సమాచారం అందుతుండగా.. తాజా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా..
Read Also:Jyothi: విజయ్ దేవరకొండతో లిప్‌లాక్ కాదు.. అంతకు మించి అయినా నాకు ఓకే
