Andhra Pradesh: వర్షం పడుతుందంటే సెల్‌ఫోన్ మాట్లాడొద్దు.. టీవీలు ఆపేయండి.. అని ఇంట్లో పెద్దలు హెచ్చరిస్తుంటారు.. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు ఈ హెచ్చరికలు చేస్తుంటారు.. ఇప్పటికే పలువురిని ఈ పిడుగులు బలి తీసుకున్నాయి కూడా.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో విద్యార్థిని పిడుగుపాటుకు బలైపోయింది..
Read Also: Mumbai: ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్..36ఏళ్ల తర్వాత రిటైర్మెంట్..
అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ చెరుకుమడత గ్రామంలో.. మంగళవారం పిడుగుపాటుకు ఓ విద్యార్థిని మృతి చెందింది. చెరుకుమడత గ్రామానికి చెందిన బడ్నాయిన కీర్తి (16) ఎస్.కోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే, దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. మంగళవారం భారీ వర్షం కురుస్తోన్న సమయంలో కీర్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంది.. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్న కీర్తి ఫోన్ పడేసి సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితికి చేరింది.. తల్లిదండ్రులు వెంటనే 108 వాహనానికి సమాచారం.. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. విద్యార్థినిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో, విద్యార్థిని కీర్తి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..
