Lowest Temperature: తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది.. ముఖ్యంగా ఏజెన్సీలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీని వణికిస్తోంది చలి.. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చలి అలుముకుంది.. ఈ సీజన్‌లో తొలిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగుల, మినుములూరు ప్రాంతాల్లో 5 డిగ్రీలు నమోదు కాగా, పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ అంతటా సింగల్ డిజిట్ టెంపరేచర్లు కొనసాగుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు అధికంగా ఉండటంతో తెల్లవారుజామున వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 10 గంటలు వరకూ సూర్యుడు ముఖం చూపించకపోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే ఈ చలి వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింటర్ టూరిజం పెరిగిపోయింది.. వంజంగి మెఘాలకొండ పై సూర్యోదయం అందాలను దర్శించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.. ప్రతీ ఏడాది వింటర్‌లో ఏజెన్సీ అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివచ్చే విషయం విదితమే.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది..
