Site icon NTV Telugu

అంబేడ్కర్‌ బాటలో సీఎం జగన్‌ నడుస్తున్నారు..!

తాడేపల్లి : టీడీపీ పార్టీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్‌ అయ్యారు. పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధాన వనరు అని సీఎం వైఎస్ జగన్ భావించారని..అంబేడ్కర్‌ బాటలో సీఎం జగన్‌ నడుస్తూ పాఠశాలను తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో స్కూల్స్ బాగాలేదని వార్తలు రాస్తున్నారని… దశల వారీగా స్కూల్స్ అభివృద్ది చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదా ? అని నిలదీశారు. ఆ స్కూల్స్ దుస్థితికి చంద్రబాబు కారణం కదా…? పక్కనే ఉన్న ఆ స్కూల్స్ ని కారు దిగి ఎప్పుడైనా పరిశీలించాడా..? అని నిప్పులు చెరిగారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి…రెండో దశ కూడా ప్రారంభం అయ్యాయన్నారు. ప్రజలంతా స్కూల్స్ విషయంలో సీఎం వైఎస్ జగన్ చర్యలను అభినందిస్తున్నారని… చివరికి చంద్రబాబు చదివిన స్కూల్ దారుణంగా ఉందని మా ఎమ్మెల్యే ఎప్పుడో చెప్పారని తెలిపారు. దాన్ని కూడా సీఎం జగన్‌ బాగుచేస్తున్నారని.. అవన్నీ ఈ పత్రికలకు కనిపించవా…? అని ప్రశ్నించారు. చివరికి చంద్రబాబు చదివిన స్కూల్ ను కూడా సీఎం జగన్‌ బాగుచేయిస్తున్నారని తెలిపారు.

Exit mobile version