ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు గుంటూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది.. హైదరాబాద్ నుండి త్రిపురాంతకం వెళ్తుండగా.. మాచర్ల మండలం ఎత్తిపోతల సమీపంలో ప్రమాదం జరిగింది.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుంచి ఢీకొట్టింది మరోకారు.. అయితే, ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయ్యింది.. ఎమ్మెల్యే కారుమూరి సురక్షితంగా బయటపడ్డారు.. మరో వాహనంలో త్రిపురాంతకం వెళ్లిపోయారు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.
Read Also: శ్రీశైలంలో 22 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు