Site icon NTV Telugu

పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎనిమిది మంది ఉండగా.. ముగ్గురు స్పాట్‌ లోనే మరణించారు. అయితే.. మృతి చెందిన వారిలో శుశాంక్ అనే బాలుడు ఉండటం గమనార్హం. టపాకాయల నిమిత్తం కామారెడ్డికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. డ్రైవర్‌ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు.

Exit mobile version