A Woman Assaulted And Killed By 67 Year Old In Krishna District: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను అత్యాచారం చేసి, కిరాతకంగా చంపేశారు. తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేయగా, పోలీసుల విచారణగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కిరాతకానికి 67 ఏళ్ల వ్యక్తి కారణమని తెలిసి విస్తుపోయారు. గన్నవరంలో జరిగిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. జనవరి 4వ తేదీన ఆత్కుర్ పోలీసులకు ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆ మహిళను అత్యాచారం చేసి చంపేసినట్టు తెలిసింది. లైంగిక దాడికి ముందు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారని, ఆమెకు మతిస్థిమితం లేదని తేలింది.
Mega Bonuses: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఉద్యోగులకు ఒకేసారి నాలుగేళ్ల బోనస్..
ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. తమకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు వీరస్వామి.. వయసు 67. హత్యాచారానికి గురైన మహిళ.. ఉంగుటూరు మండలంలోని తెలప్రోలులో ఒంటరిగా తిరగడాన్ని వీరస్వామి గమనించాడు. పైగా.. ఆమెకు మతిస్థిమితం లేదని కూడా తెలుసుకున్నాడు. దీంతో.. గత నెల 31వ తేదీన తెల్లవారు జామున ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. అనంతరం అత్యాచారం చేశాడు. తన బండారం బయటపడకుండా ఉండాలని.. ఆమెని కొట్టి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరికి పోలీసులు వీరస్వామి ఆచూకీ తెలుసుకొని, అరెస్ట్ చేశారు. గతంలో వీరస్వామిపై వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో మరో రెండు కేసులు కూడా నమోదైనట్టు విచారణలో తేలింది.
Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
