Site icon NTV Telugu

బెజవాడలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి కేసులో ట్విస్ట్‌ !

బెజవాడ అరండల్‌పేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. రాఖీ పండగనాడు తమ్ముడికి రాఖీ కట్టి వెళ్లిన ఆమె ఆ తర్వాత రెండు గంటలకే చనిపోయినట్టు కబురందింది. అయితే అత్తింటివారే ఆమెను చంపేశారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు ఉష, ఫణి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే..! ఉష ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తర్వాత అన్నీ సర్దుకున్నాయ్‌ అన్న సమయంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయన్నది ఆమె తల్లిదండ్రుల ఆరోపణ. తనకన్నా ఎక్కువ సంపాదిస్తున్న భార్యపై భర్త ఫణి కక్ష పెంచుకున్నాడని… అత్తమామలు కూడా తరచూ వేధించేవారని అంటున్నారు. మరోవైపు తనకు రాఖీ కట్టేందుకు వచ్చి వెళ్లిన అక్కను టార్చర్‌ పెట్టి చంపేసి ఉంటారని తమ్ముడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మరోవైపు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న బెజవాడ పోలీసులు… దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్త ఫణితో పాటు అత్తమామల్ని ప్రశ్నిస్తున్నారు. రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటీవలే సింధు, ఇప్పుడు ఉష… ఇలా బెజవాడలో వరుస ఘటనలు అలజడి రేపుతున్నాయి.

Exit mobile version