Site icon NTV Telugu

Extramarital Affair: గుంటూరులో దారుణం.. మరో మహిళ కోసం భార్యకి హెచ్‌ఐవీ

Man Injected Hiv To Wife

Man Injected Hiv To Wife

A Man Allegedly Injected HIV Blood To His Wife For Extramarital Affair: గుంటూరులోని తాడేపల్లిలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక భర్త, ఆమె కోసం తన భార్యకి అన్యాయం చేశాడు. ఆమెను అడ్డు తొలగించుకోవడం కోసం.. స్లో డ్రగ్‌తో పాటు హెచ్‌ఐవీ వైరస్‌లను ఎక్కించాడు. పిల్లల కోసమని చెప్పి, ఇంజెక్షన్ల ద్వారా ఆమె ఆ డేంజరస్ వ్యాధుల్ని అంటగట్టాడు. తీరా అసలు విషయం తెలిసి.. పాపం ఆ మహిళ భోరుమంది. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

తాడేపల్లికి చెందిన మమతకు, మంగళగిరి భార్గవపేటకు చెందిన చరణ్ కుమార్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. మూడేళ్ల క్రితం వీరికి ఒక పాప పుట్టింది. ఆ సమయంలోనే మమతకు రక్తపరీక్షలు చేయగా.. ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కానీ భర్తకు రక్తపరీక్షలు చేస్తే మాత్రం హెచ్‌ఐవీ నెగెటివ్‌గా తేలింది. దీంతో ఖంగుతిన్న మమత.. తనకు భర్తతో తప్ప మరెవ్వరితో ఫిజికల్ రిలేషన్‌షిప్ లేదని, మరి తనకెలా హెచ్‌ఐవీ సోకిందని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై భర్తను నిలదీసింది. అందుకు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు.. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా హెచ్‌ఐవీ సోకి ఉండొచ్చని చరణ్ మాయమాటలు చెప్తూ వచ్చాడు. అప్పుడు భర్త మాటల్ని నమ్మింది కానీ, ఆ వ్యాధి విషయంలో నిత్యం ఆందోళనలోనే ఉంది.

ఇంతలో మమకి మరో ఊహించని షాక్ తగిలింది. తన భర్త చరణ్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని విషయం మమతకి తెలిసింది. అప్పుడే మమతకి అర్థమైంది.. ఆ యువతి కోసం తన భర్తే తనకు హెచ్‌ఐవీ ఎక్కించాడని! దీంతో ఆమె వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. తాను పిల్లలు కనేందుకు వీక్‌గా ఉన్నానని చెప్పి.. ఆర్ఎంపీ డాక్టర్‌తో తన భర్త రకరకాల ఇంజెక్షన్లు వేయించాడని చెప్పింది. మగ పిల్లాడి కోసం ఇంకో పెళ్లి చేసుకుంటానని చరణ్ హింసించాడని, తనని వదిలించుకోవడం కోసమే స్లో డ్రగ్, హెచ్‌ఐవీ ఎక్కించాడని వాపోయింది. తనకు హెచ్‌ఐవీ ఎలా వచ్చిందో తెలియాలని కోరుతూ.. తాను పోలీసుల్ని ఆశ్రయించానని మమతా తెలిపింది.

మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె భర్త చరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. అతనికి మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. మమతకి అతడు ఎలా హెచ్‌ఐవీ ఎక్కించాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ కేసుని పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. మమత తల్లిదండ్రులు చరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురి జీవితాన్ని నాశనం చేసిన చరణ్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Exit mobile version