కరోనా మహమ్మారి కలవర పెడుతూనే ఉంది.. ఎప్పుడు, ఎవరికి, ఎక్కడి నుంచి కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.. కాగా, ఉద్యోగులకు లేదా కుటుంబ సభ్యులకు కరోనా సోకితే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్… దీంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం.. ఇక, ప్రభుత్వ నిర్ణయంతో సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు. మరోవైపు.. ఉద్యోగి తల్లిదండ్రులకు, అతనిపై ఆధారపడి జీవించేవారికి కోవిడ్ పాజిటివ్‌గా వస్తే.. 15 రోజులు స్పెషల్ లీవ్ ఇవ్వాలంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇంట్లోవారికి కరోనా సోకినా ఉద్యోగులకు 20 రోజుల సెలవు.. సీఎం గ్రీన్ సిగ్నల్

ys jagan