NTV Telugu Site icon

18వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. 45 రోజుల పాటు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ఈ మహాపాదయాత్రం సాగనుంది. అయితే నేడు 18వ రోజు ప్రకాశం జిల్లా గుడ్లూరులో మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం వద్ద నేటి పాదయాత్ర ముగియనుంది.

45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర డిసెంబర్‌ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా రాజధాని రైతులు మహాపాదయాత్రను చేస్తున్నారు. రైతుల పాదయాత్రకు ఊరూరా ప్రజలు, రైతులు నీరాజనం పడుతున్నారు.