Site icon NTV Telugu

పోక్సో కేసుల విచారణకు ఏపీలో 16 ప్రత్యేక కోర్టులు

cm jagan

పోక్సో కేసుల సత్వర విచారణకు ఏపీలో 16 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసారు. ప్రత్యేక కోర్టుల పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. చిత్తూరు, తూ.గో, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం,కర్నూలు, కడప, అనంత జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను జిల్లా మొత్తం పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం… విజయవాడ ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్‌ ఏరియాను నిర్ధారించించి. మిగిలిన కృష్ణా జిల్లా అంతా మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. గుంటూరు ప్రత్యేక కోర్టు పరిధిలోకి గుంటూరు, గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లు వస్తుండగా… తెనాలి స్పెషలి పరిధిలోకి తెనాలి రెవెన్యూ డివిజన్‌… ఏలూరు ప్రత్యేక కోర్టు పరిధిలోకి ఏలూరు, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లు… భీమవరం పరిధిలోకి భీమవరం, నరసాపురం రెవెన్యూ డివిజన్లు రానున్నాయి.

Exit mobile version