NTV Telugu Site icon

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సేకరించిన 15 వేల చెక్కులు బౌన్స్

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ సేకరించిన 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి. చెక్కుల విలువ సుమారు 22 కోట్లుగా ఉంటుందని మందిర ట్రస్ట్ తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు లేకపోవడం,సాంకేతిక సమస్యల కారణంగా చెక్కులు బౌన్స్ అయినట్లు వెల్లడించింది. సాంకేతిక లోపాలు సవరించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ సభ్యులు ఒకరు తెలిపారు.కాగా ఈ చెక్కుల్లో దాదాపు 2 వేల చెక్కులు అయోధ్య నుంచి వచ్చినట్లు చెప్పారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వీహెచ్‌పీ విస్తృతంగా విరాళాలు సేకరించింది.ఈ సందర్భంగా దాదాపు రూ.5 వేల కోట్లు సమకూరగా ట్రస్ట్ ఇంకా అధికారంగా వెల్లడించలేదు.  ట్రస్ట్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్ల రూపాయలకు పైగా విరాళాల సేకరణ జరిగినట్లు సేకరణ ముగిసిన రోజు పేర్కొన్నారు. ఇంకా కొంత నగదు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉందని, అలాగే కొన్ని చెక్ లు పెండింగ్ లో ఉన్నాయని, బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండటంతో పూర్తి మొత్తంలో ఎంత సేకరణ జరిగింది అన్నది తెలియడానికి మరికొంత సమయం పడుతుందని ట్రస్ట్ తెలియజేసింది.