14 Consultancy Companies Cheated Unemployed In The Name Of Job In Vizag: ఉద్యోగం కోసం నిరుద్యోగులు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో, కన్సల్టెన్సీ కంపెనీల్లో.. అనునిత్యం శోధిస్తూనే ఉంటారు. తమ ప్రొఫైల్‌కి తగినట్టు ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదా అని.. ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. డబ్బులు ఇచ్చైనా సరే, ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసుకొని, కొందరు ఆగంతకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే నిరుద్యోగుల్ని లక్ష్యం చేసుకొని, భారీ మోసాలకు పాల్పడుతున్నారు. లక్షలకు లక్షలు దోచుకొని, బోర్డులు తిప్పేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి మోసం విశాఖపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వెలుగు చూసింది. ఏకంగా 14 కన్సల్టెన్సీ కంపెనీలు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసినట్టు తేలింది.
Balineni Srinivasa Reddy: చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగాల పేరిట ఈ 14 కన్సల్టెన్సీ కంపెనీలు నిరుద్యోగుల్ని టార్గెట్ చేశారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, కాకినాడ నుంచి కన్సల్టెన్సీ దందా కొనసాగించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో భారీ ప్యాకేజ్‌లకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షలు చొప్పున వసూలు చేశారు. ఇలా వందలాది నిరుద్యోగుల నుంచి ఆ దొంగ సంస్థలు డబ్బులు తీసుకున్నారు. జావా మేటిక్, డ్రీమ్ జాబ్ వంటి పేర్లతో ఉన్న ఆయా కన్సల్టెన్సీ సంస్థల్లో బాధితులు డబ్బులు కట్టారు. సమయం గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం, ఆ సంస్థలు బోర్డు తిప్పేయడం.. తాము మోసపోయామని బాధితులు భావించి, స్పందనలో ఫిర్యాదు చేశారు. విశాఖలోని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Brahmos Misfire: బ్రహ్మోస్ మిస్ ఫైర్.. 24 కోట్ల నష్టం.. ఢిల్లీ హైకోర్టుకు సమాచారమిచ్చిన కేంద్రం