విశాఖ జీవీఎంసీకి కొత్త బాస్ వచ్చారు. జీవీఎంసీ కమీషనర్ గా లక్ష్మీ షా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 23వ తేదీ న లక్ష్మీ షా ను కమీషనర్ గా నియమిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఇవాళ జీవీఎంసీ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తన కెరియర్ లో కమీషనర్ బాధ్యత అనేది మొదటి సారిగా నిర్వర్తిస్తున్నానని వివరించారు. అందమయిన విశాఖ నగరానికి రావడం సంతోషంగా వుందన్నారు. ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు సహకారంతో జీవీఎంసీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
జీవీఎంసీ కమీషనర్‌గా లక్ష్మీ షా బాధ్యతల స్వీకరణ
