మీరు రోజంతా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా? మీరు వెతికే వెబ్ సైట్లు, బ్యాంక్ వివరాలన్నీ హ్యాకర్స్ చేతికి చిక్కుతున్నాయంటే నమ్ముతారా? మీరు నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. హ్యాకర్స్ తమ టెక్నాలజీని ఉపయోగించి యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీని కనుక్కొని అందుకు అనుగుణంగా వినియోగదారులకు ఫోన్ చేసి వారి రహస్య సమాచారం సేకరిస్తున్నారు. వారి బ్యాంకింగ్ లావాదేవీలను తెలుసుకుని డబ్బులు లాగేస్తున్నారు.
బ్యాంకులకు సంబంధించి వినియోగదారులను బుట్టలో పడేస్తున్నారు. నార్టన్ కన్జ్యూమర్ సైబర్ సేఫ్టీ పల్స్ రిపోర్ట్ తాజాగా విభ్రాంతికర అంశాలను బయటపెట్టింది. దేశంలో జరుగుతున్న ఆన్ లైన్ మోసాలకు సంబంధించి కీలక సమాచారం వెల్లడిచేసింది. అంతగా సేఫ్టీ కాని కంప్యూటర్ డివైజ్ ల ద్వారా వారు సెర్చ్ చేసిన వెబ్ సైట్లు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. దాని ద్వారా వారికి ఫోన్లు చేసి మరీ వారి నుంచే సమాచారం అందుకుంటున్నారు. ఓటీపీల ద్వారా వారి బ్యాంకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు.
2 గంటల పాటు బ్రౌజ్ చేసిన హిస్టరీ చాలు స్కామర్లకు దోచేయడానికి. కాబట్టి వినియోగదారులు తాము ఏ డివైజ్ నుంచి సెర్చ్ చేసినా ఆ రోజు చివరిలో ఆ బ్రౌజింగ్ హిస్టరీనీ డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా సర్వేలో 80 శాతం మోసాలు బ్రౌజింగ్ హిస్టరీ ద్వారానే జరుగుతున్నాయని తేలింది. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ నిర్వహించిన సర్వేలో 18,769,678సైబర్ అటాక్స్ జరిగాయి. అందులో రోజుకి 2,04,311 మోసాలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 3.6 బిలియన్ సైబర్ మోసాల్లో 10 మిలియన్ సైబర్ మోసాలు రోజువారి జరిగాయి. 53.9 మిలియన్ ఫిషింగ్ అటెంప్ట్ లు జరిగాయని నార్టన్ సంస్థ తెలిపింది. అలాగే, ఫైల్ థ్రెట్స్ జరిగినవి ఏకంగా 221 మిలియన్లు, మొబైల్ థ్రెట్స్ జరిగినవి 1.4 మిలియన్లు. ర్యాన్ సమ్ వేర్ అటాక్స్ జరిగాయి. కాబట్టి ఆన్ లైన్ లో వుండే వినియోగదారులు తమ సెన్సిటివ్ సమాచారం పట్ల అప్రమత్తంగా వుండాలని నార్టన్ కన్జ్యూమర్ సైబర్ సేఫ్టీ పల్స్ రిపోర్ట్ హెచ్చరిస్తోంది.