Foreign Portfolio Investors: మన ఈక్విటీ ‘మార్కెట్’పై విదేశీయులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. నవంబరులో ఫారన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) 36 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టారు. మరీ ముఖ్యంగా ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్’లోకి ఇన్వెస్ట్మెంట్ల ప్రవాహం కొనసాగింది. ఈ ఒక్క రంగంలోకే 14 వేల 205 కోట్ల రూపాయలు వచ్చాయి. గత నెల మొత్తమ్మీద ‘ఈక్విటీ సెగ్మెంట్’లో FPIలు నెట్ బయ్యర్లుగా నిలిచారు.
ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్ తర్వాత కన్జ్యూమర్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు ఐటీ రంగాలు పెట్టుబడులను బాగా ఆకర్షించాయి. అయితే.. నవంబర్ ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధంలో FPIలు మూడొంతులు తగ్గాయి. మొదటి 15 రోజుల్లో 28 వేల 888 కోట్ల రూపాయలు రాగా చివరి 15 రోజుల్లో 7 వేల 350 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ద్వితీయార్ధంలో ‘ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్’లోకి 2 వేల 753 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.
read more: Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
ఎఫ్‌పీఐలు పోటెత్తడంతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ సెక్టార్ 2 శాతం లాభాలను ఆర్జించింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ 6.36 శాతం ప్రాఫిట్స్ నమోదు చేశాయి. షేర్ల ధరలు పెరిగిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు ఉన్నాయి.
