Site icon NTV Telugu

భారత్ వర్సెస్ పాక్.. కళ్లు చెదిరే బెట్టింగులు?

మరికొద్ది గంటల్లో దయాదుల సమరం మొదలుకానుంది. మైదానంలో భారత్, పాక్ క్రికెట్ జట్లు చిరుతలను తలిపించేలా వేట(ఆట)కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై ఇండియా, పాక్ జట్లు ఎప్పుడు తలపడినా ప్రేక్షకుల్లో హైవోల్టేజీని పెంచుతూనే వచ్చాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్ లో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో రాత్రి 7.30గంటలకు మొదలుకానున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రియులంతా ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఫేవరేట్ గా ఇండియా బరిలో దిగనుంది. అయితే పాకిస్థాన్ ను కూడా తక్కువ అంచనా వేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ కప్ లాంటి మేజర్ ఈవెంట్స్ లో పాక్ పై భారత్ దే పైచేయిగా ఉంది. పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ను ఒక్కసారి కూడా ఓడించిన దాఖలాలేవు. దీంతో ఈసారి కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలని టీంఇండియా ఉవ్విళ్లురుతోంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం గతం గతః అని ఈసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.

భారత్, పాకిస్థాన్ జట్లు చివరి సారిగా 2019 వరల్డ్ వన్డే వరల్డ్ కప్ లో తలబడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సూపర్-12 రౌండ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు తలపడేందుకు ముహుర్తం ఫిక్స్ అవడంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఈ మ్యాచ్ పై వెయ్యి కోట్ల పైగానే బెట్టింగులు జరుతున్నాయని టాక్ విన్పిస్తోంది.

టీ-20 క్రికెట్ ఫార్మాట్ ఉన్న క్రేజ్ దృష్ట్యా బెట్టింగ్ స్వరూపం కూడా మారింది. టీం-11 నుంచి మొదలు పెడితే టాస్.. బాల్ టూ బాల్.. ఫోర్లు.. సిక్సర్లు.. వికెట్లు.. ఎవరు గెలుస్తారు? వంటి అంశాలపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పోలీసులు బెట్టింగ్ అరికట్టేందుకు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. పందెంరాయుళ్లు ప్రత్యేక యాప్స్ తయారుచేసి బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బుకీలు ప్రత్యేకమైన ఆఫర్లు సైతం ఇస్తున్నారు.

పాక్ పై వెయ్యికి రూ.1,600లు.. పాక్ పై వెయ్యికి రూ.500 నుంచి 800 వరకు ఆన్ లైన్ బెట్టింగ్ నడుస్తోందని సమాచారం. ఇక ఈ మ్యాచుల కోసం ప్రముఖ రెస్టారెంట్స్, హోటళ్లు పెద్ద స్కీన్ లను ఏర్పాటు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. టాస్ గెలిచిన జట్టు ఆధారంగా కూడా బెట్టింగ్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 2017 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడగా.. అప్పుడు రెండువేల కోట్ల బెట్టింగ్ జరిగిందని టాక్. అయితే నేటి మ్యాచ్ ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువని ప్రచారం జరుగుతోంది.

Exit mobile version