NTV Telugu Site icon

Teak Farming : టేకు మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Young Trees, Teak Plantation In Thailand

Young Trees, Teak Plantation In Thailand

రైతులు అన్ని రకాల పంటలను పండిస్తున్నారు.. అందులో టేకు కూడా ఒకటి.. వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మన దేశంలో వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అత్యంత నాణ్యమైన కలపని ఇచ్చే టేకు మొక్కలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టేకు మొక్కల సాగు చేయొచ్చు.. ఈ పంట గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ టేకును సాగు చెయ్యడానికి ముఖ్యంగా ఎర్రనేల, ఒండ్రు నేలలు బాగా నాణ్యమైనవి అని చెప్పొచ్చు. అయితే టేకు మొక్కలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?, ఏ విధమైన పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చునో ఇప్పుడు చూద్దాం..

టేకు మొక్కలను సాగు చేయడానికి నీటి ముంపు ప్రదేశాలు అస్సలు అనుకూలం కావు. టేకు మొక్కలుని విత్తనాలు లేదా పిలకల నుంచి పునరుత్పత్తి చేయొచ్చు. టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి కూడా చేయొచ్చు. వీటికి మొలకల శాతం ఎక్కువగానే ఉంటుంది.. ఈ టేకు విత్తనాలకు వివిధ రకాల సీడ్ ట్రీట్మెంట్ చేస్తే మొలక శాతం పెరుగుతుంది. విత్తనాలను వేడి నీటిలో 2-3 గంటల వరకు ఉంచి చల్లారాక విత్తుకుంటే మంచిది. లేదు అంటే మరో పద్దతి వుంది. అదేమిటంటే విత్తనాలను ఒక గోనె సంచిలో వేసి గుంతలో పూడ్చి పది, పదిహేను రోజులు నీళ్లు పోస్తే మొక్కలు వస్తాయి.. వాటిని పంట పొలంలో నాటుకుంటే ఇక మొక్కలు బాగా దృడంగా పెరుగుతాయి.. వీటి గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది..

Show comments