వ్యవసాయం చేసే రైతులు కేవలం వ్యవసాయం మాత్రమే కాదు.. గొర్రెలను కూడా పెంచుతున్నారు.. ఈ గొర్రెలను పెంచడం సులువైన పనికాదు..పెంపకదారులు తమకున్న కొద్ది స్థలంలోనే ఫారాలను ఏర్పాటు చేసుకొని ఆదాయాన్ని పొందుతున్నాడు. అయితే వర్షాకాలంలో గొర్రెల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే అని చెప్పాలి.
ముఖ్యంగా ఆరు బయట తిరిగే మేకలు గొర్రెలు పచ్చిగడ్డిని తింటూ, చెరువులో, మురికి కాలువల్లో నీటిని తాగుతూ, తొలకరి జల్లులకు తడుస్తూ ఉండటం వల్ల పలు రకాల రోగాలకు గురవుతాయి. వానాకాలంలో ఎక్కువగా చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, పిపిఆర్ వంటి రోగాలు వచ్చి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి జీవాలను రక్షించడానికి పలురకాల జాగ్రత్తలు తీసుకోవాలి.. గొర్రెలకు ఆహారం మంచిగా ఉన్నా కూడా వ్యాదులు సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..
ఇకపోతే ఈ చినుకులకు మొలిచిన గడ్డిని తింటే చిటుకు వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు..టీకాలను గొర్రెలకు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి గొర్రెలను కాపాడవచ్చు. వర్షాకాలంలో చిత్తడినేలలో ఎక్కువసేపు తిరగడం వలన బ్యాక్టీరియా వలన కాలి పుండు వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన గొర్రెల కుంటుతూ నడుస్తాయి. అందుకే వీటిని బురద నెలలో తిరగనివ్వకుండా జాగ్రత్త పడాలి..
ఇకపోతే వర్షాకాలంలో ఈగలు, దోమలు బెడద ఎక్కువగా ఉంటాయి. క్యులికోయిడ్స్ అనే దోమ కాటు వలన ఆరోగ్యంగా ఉన్న గొర్రెలలో కూడా ఆర్బోవైరస్ సంక్రమించి నీలినాలుక వ్యాధికి గురౌతాయి. ఈ వైరస్ రక్తనాళంను నాశనం చేస్తాయి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టీకాలు వేయడం వల్ల వ్యాధిని నివారించి అధిక దిగుబడిని పొందవచ్చు.. ఈ వ్యాదులు సోకిన గొర్రెలు మేతను మేయ్యవు.. చెడిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.. అందుకే గొర్రెలకు మేతను మేసేటప్పుడు చూసి వెయ్యడం మంచిది.. అలాగే వ్యాధి సోకిన గొర్రెలను మంద నుండి వేరు చెయ్యాలి.. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే పశు వైద్యులను సంప్రదించాలి..