Site icon NTV Telugu

World Record:  ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌… ఇండియాలోనే…

సాధార‌ణంగా ఇగ్లూ అన‌గానే మ‌న‌కు దృవ‌ప్రాంతాలు గుర్తుకు వ‌స్తాయి.  అక్క‌డి ప్ర‌జ‌లు మంచుతోనే చిన్న‌చిన్న ఇల్లు క‌ట్టుకొని జీవ‌నం సాగిస్తుంటారు. ఇగ్లూ హౌస్ మోడ‌ల్‌లోనే ఇగ్లూ కేఫ్‌ను జ‌మ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేశారు.  37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వ్యాసార్థం ఉన్న ఈ ఇగ్లూ కేఫ్ గిన్నీస్‌బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్‌లోకి ఎక్కింది.  జ‌మ్మూకాశ్మీర్‌లోని గుల్మర్గ్ లో ఈ కేఫ్‌ను నిర్మించారు.  ఈ కేఫ్ నిర్మాణం 64 రోజుల్లో పూర్త‌యిన‌ట్టు నిర్వ‌హ‌కులు తెలిపారు.  25 మంది వ‌ర్క‌ర్లు 1700 పనిగంట‌లు ప‌నిచేసి ఈ ఇగ్లూ కేఫ్ ను రూపోందించారు. ఈ కేఫ్‌లో మొత్తం 10 టెబుళ్ల‌ను ఏర్పాటు చేశారు.

Read: Glass Bridges: ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నగ్లాస్ వంతెన‌లు…

ఒకేసారి 40 మంది కూర్చొని భోజ‌నం చేసేందుకు వీలు ఉంటుంద‌ని నిర్వ‌హ‌కులు చెబుతున్నారు. ఈ ఇగ్లూ కేఫ్ గోడ‌లు 5 అడుగుల మందంతో ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. మార్చి 15 వ‌ర‌కు ఈ ఇగ్లూ కేఫ్ ఓపెన్‌లో ఉంటుంద‌ని, మార్చి 15 త‌రువాత క‌ష్ట‌మ‌ర్ల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని నిర్వ‌హకులు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లో ఈ త‌ర‌హా ఇగ్లూకేఫ్ ను చూసిన త‌రువాత వ‌చ్చిన ఆలోచ‌నతో జ‌మ్మూకాశ్మీర్‌లోని గుల్మార్గ్ లో ఈ కేఫ్‌ను ఓపెన్ చేసిన‌ట్లు నిర్వ‌హ‌కులు తెలియ‌జేశారు.

Exit mobile version