NTV Telugu Site icon

Wife Plan: భర్తను సిగరెట్‌ తాగొద్దంటే వినలేదు.. భార్య మాస్టర్‌ ప్లాన్‌..

Wife Plan

Wife Plan

Wife Plan: మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం ప్రతి ఒక్కరికి ఆఖరికి చిన్నపిల్లలకు కూడా తెలుసు.. అదే విషయాన్ని సిగరెట్‌ తాగే ప్యాక్‌లపై, మందు తాగే బాటిల్లపై కూడా ఉంటుంది. అది రాసినందుకో ఏమో దానికి విపరీతంగా బానిసలవుతుంటారు. దానికి ఒక్కసారి బానిసయ్యామంటే ఇక దాన్ని వదిలించేందుకు ప్రాణం పోయేంత పని అవుతుంది. మనం తాగాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో తాగి మత్తులో ఊగుతూ ఉండటమేకాదు దానికి తోడు ధూమపానం చేసి ఆనందంగా అన్ని మరిచిపోయాము అనుకుంటారు కానీ దాని కారణంగా ఎంతోమంది ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

కుటుంసభ్యలు వారిని నానా తంటాలు పడి వారు అలవాటు చేసుకున్న మద్యం, సిగరెట్లను మాన్పించేందుకు అయితే ఇక ఇలా మద్యపానం ధూమపానానికి అలవాటైన వారిని మానుకోవాలని ఎంత చెప్పినా పెడచెవిన పెడుతూ ఉంటారు. దీనికి బానిసైన వారిని కాస్త సరికొత్తగా ఆలోచించి తమ కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో మద్యపానం ధూమపానం లాంటి చెడు అలవాట్లను మాన్పించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎవరైనా కాస్త విచిత్రంగా ప్రవర్తించారు అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది. ఒక భార్య ఏకంగా భర్తను మద్యం మానిపించడానికి వేసిన ప్లాన్ ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది. దాన్ని కాస్త సామాజిక మాధ్యామాల్లో పోస్ట్‌ చేయడంతో.. ఈ వీడియో నెటిజెన్స్ దృష్టిని తెగ ఆకర్షిస్తూ తెగ వైరల్ మారింది.

Read also: Tamilnadu: ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి చీలిక దిశగా పయనిస్తోందా?

తన భర్తకు సిగరెట్ తాగే అలవాటు ఉందని తాను ఎంత చెప్పిన భర్త వినకపోవడంతో సరికొత్త ఐడియాను ఉపయోగించింది. మరి భార్య మజాకా.. భర్త చెప్పింది చేయకపోతే మరి ఊరికే ఉంటుందా ఏంటి. అందుకే మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. భర్త మీద ఎంత ప్రేమ ఉంటేగానీ ఆమె ఆపని చేయదు చెప్పండి. మద్యం, సిగరెట్ మాన్పించేందుకు ఆమె చేసిన ఐడియా చూస్తే నిజంగా ఈ ఇల్లాలిని మీరు జోహార్‌ అంటారు మరి. ఇంతకీ ఆమె చేసిన ఐడియాలు గృహణీలు చూస్తే మాత్రం ఆ ఐడియాను ఫాలో ఐపోతారు. తన భర్త సిగరెట్‌ మానమంటే మానడం కష్టం అన్నాడనే కోపంతో భర్తకు తెలియకుండా భార్య తన సిగరెట్‌ పెట్టను కిచెన్‌ రూంలో తీసుకుని వచ్చింది. ఫ్రిజ్‌ లో ఉన్న పండు మిరపకాయలను తీసింది. దాన్ని మద్యలో కట్‌ చేసింది. ఇక సిగరెట్‌ పెట్టెలోంచి ఒక్కొక్క సిగరెట్‌ తీసి కట్ చేసిన పండు మిరపకాయ మధ్యలో పెట్టి రసాన్ని సిగరెట్ లకు పెట్టి మళ్లీ పెట్టలో పెట్టింది.

ఆమె చేస్తు్న్న ఈ ఐడియాను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో చూసిన వారందరూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇది చూసిన ఎంతోమంది సతీమణులు తమ భర్తను సిగరెట్ మాన్పించేందుకు ఇదేదో ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. భర్తమీద ఎంత ప్రేముంటే మాత్రం సిగరెట్లు మాన్పించేందుకు భార్య చేసిన పనికి సభాష్‌ అంటున్నారు. మరి కొందరైతే నిజంగానే ప్రేమతో చేసిందా? లేక తను షాపింగ్‌ కు తీసుకుపోలేదని ఇలా తన భర్తపై కసి తీర్చుకుందా అంటూ కమెంట్లు చేస్తున్నారు. అది సరే మరి ఆ సిగరెట్ తన భర్త తాగి ఏమైపోయాడో ఏంటో అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదైతేనేం భార్య చేసిన సరికొత్త ఐడియాకు సలామ్‌ చేయాల్సిందే. ఇలాంటి ఐడియాలు భార్యలకు మాత్రమే వస్తాయి. అలాంటి ఐడియాలు వారికే సాటి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
CM YS Jagan: నేడు తిరువూరులో సీఎం పర్యటన.. వారికి ఖాతాల్లో ఈ రోజే సొమ్ము జమ..

Show comments