Urfi Javed Viral Video: ఉర్ఫీ జావేద్ టీవీ ఇండస్ట్రీలో తరచూ ట్రోలింగ్‌కు గురయ్యే నటీమణుల్లో ఒకరు. ఒకప్పుడు ఆమె వేసుకునే దుస్తులు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపేవి. ఉర్ఫీ ఫొటోలు, వీడియోలు చూసి కొందరు కళ్లే మూసుకునే పరిస్థితి ఉండేది. అయితే కాలక్రమేణా ఆమె కాస్త నిశ్శబ్దంగా మారిందనే అభిప్రాయం ఉంది. కాగా.. మీడియా ముందుకు మాత్రం ఇంకా హంగామా తప్పడం లేదు. ఇటీవల ఉర్ఫీ జావేద్ ఒక ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో ఆమె వేసుకున్న దుస్తులు అంత ప్రత్యేకంగా ఉండటంతో నడవడమే కష్టమయ్యింది.
READ MORE: Iran Warns Protests: ఇరాన్‌లో ఆందోళనకారులపై కఠిన ఆంక్షలు.. నిరసనల్లో పాల్గొంటే మరణశిక్షే!
మీడియా వద్దకు వెళ్లేందుకు ఆమె ట్రాలీ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడవడం కష్టంగా ఉందని, అందుకే హోటల్ సిబ్బంది ట్రాలీ ఇచ్చారని ఆమె చెప్పింది. వేదిక వరకు నడిచివెళ్తే 20 నిమిషాలు పడుతుందని వీడియోలో ఆమె వ్యాఖ్యానించింది. ఆ వీడియోలో ఉర్ఫీ తెలుపు రంగు దుస్తుల్లో కనిపించింది. మేకప్, హై హీల్స్‌తో ఆమె లుక్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలకు కారణమైంది. కొందరు నెటిజన్లు ఆమెను ఎద్దేవా చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. నడవడానికి కూడా రానంత ఫిట్ ఎందుకు ఉర్ఫీ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉర్ఫీకి సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉర్ఫీ కెమెరా ముందు నుంచి వెళ్లగానే అక్కడ ఉన్న టీవీ నటులు ఆమెపై చర్చించుకుంటూ నవ్వుకుంటున్నట్లు కనిపిస్తోంది. అలీ గోని, జాస్మిన్ భసిన్, జన్నత్ జుబేర్, ఈషా మాల్వీయ పరస్పరం మాట్లాడుకుంటూ నవ్వడం వీడియోలో ఉంది.
READ MORE: Iran Warns Protests: ఇరాన్‌లో ఆందోళనకారులపై కఠిన ఆంక్షలు.. నిరసనల్లో పాల్గొంటే మరణశిక్షే!
