గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. వరుసగా 6, 4, 2, 4 సాధించాడు. దీంతో తనలో పవర్ తగ్గలేదని ధోనీ చాటిచెప్పాడు.
అయితే ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని కేటీఆర్ పోస్ట్ చేశారు. ధోనీ ఓ ఛాంపియన్ క్రికెటర్ అని, అతనో అసాధారణ ఫినిషర్ అని కొనియాడారు. రోజు రోజుకు ఈ లెజెండరీ క్రికెటర్ మరింత పరిణితి చెందుతున్నాడని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Age indeed is just a number!!!
What an outstanding finisher this champion is @msdhoni #MSDhoni the legend grows 👏👏
— KTR (@KTRBRS) April 21, 2022
అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై విజయంపై ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజాలో చివరి వరకూ అనుమానాలు నెలకొన్నాయట. ఈ విషయాన్ని అతడు మ్యాచ్ ముగిశాక స్వయంగా చెప్పాడు. మ్యాచ్ సాగుతున్న తీరు తనతో పాటు ఆటగాళ్లందరినీ టెన్షన్‌కు గురి చేసిందన్నాడు. గెలుస్తామా? లేదా అనే ఆందోళన చివరి వరకు కొనసాగిందని పేర్కొన్నాడు. ధోనీ క్రీజ్‌లో ఉన్నాడనే ధైర్యం తమను కుదురుకునేలా చేసిందని వివరించాడు. కాగా టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఇది రెండో విజయం కాగా ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రం వరుసగా ఏడో పరాజయం.
