NTV Telugu Site icon

వైర‌ల్‌: స‌ముద్రంలో బోటును వెంబ‌డించిన వింత‌జీవి… క్ష‌ణం ఆల‌స్య‌మైతే…

స‌ముద్రంలో ఎన్నో ర‌కాల జీవులు నివ‌శిస్తుంటాయి. స‌ముద్రంలో చేప‌లు, తిమింగ‌లాలు, డాల్ఫిన్‌లు ఉంటాయ‌నే సంగ‌తి తెలుసు. అయితే, మ‌న‌కు తెలియ‌ని చాలా జ‌ల‌చ‌ర జీవాలు స‌ముద్రంలో నివ‌శిస్తుంటాయి. చాలా త‌క్కువ‌గా మాత్ర‌మే అలాంటి జీవులు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. స‌ముద్రంలో షికారుకు వెళ్లిన ఓ వ్య‌క్తిని విచిత్ర‌మైన జంతువు వెంబ‌డించింది. దానిని చూసిన ఆ వ్య‌క్తి షాక్ అయ్యాడు. వెంట‌నే బోటు వేగాన్ని పెంచాడు. బోటు వేగంతో పాటు ఆ విచిత్ర‌మైన జంతువు కూడా వేగంగా ఆ బోటు వైపు దూసుకొచ్చింది. అది నీళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌పుడు క‌ళ్లు చింత‌నిప్పుల్లా ఎర్ర‌గా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను స‌ద‌రు వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. కాగా, ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఈ సంఘ‌ట‌న బ్రెజిల్‌లో జ‌రిగింది.

Read: 2021లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు… ప్ర‌తిగంట‌కు…