Site icon NTV Telugu

Leopard-Lion fight: పిల్లలను కాపాడుకునేందుకు సింహంతో తల్లి చిరుతపులి ఫైటింగ్.. చివరికి ఏమైందంటే..!

Leopardlion Fight

Leopardlion Fight

ఈ ప్రకృతిలో తల్లి ప్రేమ అనేది అపురూపమైనది. అది వెలకట్టలేనిది. మనిషైనా, జంతువైనా, ఆకాశ పక్షులైనా తల్లి ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. తమ బిడ్డల కోసం శత్రువుతో ఎంతకైనా తెగించి పోరాడతారు. ఇలాంటి ఘటనే తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Fitness Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?

చిరుతపులి ఒక గుహలో ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అటుగా ఒక సింహం వచ్చింది. తన పిల్లలకు ఏం హాని తలపెడుతుందోనని భయాందోళన చెందింది. తన పిల్లల వైపు వస్తున్న సింహాన్ని అడ్డగించేందుకు తల్లి చిరుతపులి కోపంతో రగిలిపోయింది. పిల్లల దగ్గరకు వస్తున్న సింహంపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. చాలా సేపు సింహంతో పోరాడింది. మొత్తానికి సింహాన్ని తరిమికొట్టేసింది. ఈ ఘటన ఆఫ్రికాలోని టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. సాహస యాత్రలో ఉన్న కరోల్, బాబ్ అనే జంట రికార్డ్ చేశారు. ‘‘లేటెస్ట్‌సైటింగ్స్’’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అక్టోబర్ 24న షేర్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింహంతో తల్లి చిరుతపులి వీరోచితంగా పోరాడి పిల్లలను సంరక్షించుకుంది. అయితే ఈ ఫైటింగ్‌లో చిరుతపులి గాయపడింది. అంతేకాకుండా తన పిల్లలను ఆ గుహ నుంచి మరొక గుహకు తరలించడంతో చిరుతపులి అలిసిపోయింది.

 

Exit mobile version