Site icon NTV Telugu

Viral Video: సంగీతంపై మనసు పారేసుకున్న నక్క.. ఏం చేసిందంటే..?

viral news

viral news

సంగీతానికి ఫిదా అవ్వని వారు ఉండరు. ఆనందమైన , భాద అయిన, విషాదమైన సంగీతం లేకుంటే మంచి ఉండలేడు. సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు. జంతువులు, పక్షులు స్పందిస్తాయి అని వినే ఉంటాం.. ఇదుగో ఇక్కడ చూడొచ్చు కూడా. ఒక నక్క .. సంగీతానికి మైమరచిపోయి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆండీథార్న్ అనే వ్యక్తి ఒక కొండ మీద బాంజో వాయిస్తూ కనిపించాడు. ఇక అటుగా వెళ్తున్న ఒక నక్క ఆ సంగీతం విని మైమరచిపోయింది. అక్కడ వాయిస్తున్న వ్యక్తి వద్దకు వచ్చి ఎదురుగా కూర్చొని ఆ సంగీతాన్ని వింటూ ఎంజాయ్ చేసింది. మనుషులను చూస్తూనే ఆమడ దూరం పారిపోయే నక్క .. ఇలా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా వినడం మేమెక్కడ చూడలేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు.. సంగీతానికి ఉన్న పవర్ అలాంటిది అంటూ చెప్పుకొస్తున్నారు.

Exit mobile version