Can You Eat Snake Eggs: వర్షాకాలం మొదలైందంటే చాలు సర్పాల బెడద ఎక్కువగా ఉంటుంది. పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. కానీ.. మీరు పాము గుడ్డును ఎప్పుడైనా చూశారా? దాన్ని తిన్నారా? దాన్ని ఆమ్లెట్ వేసుకుని తింటే ఏమౌతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఆసియా కప్ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ ఇదే
వైల్డ్‌లైఫ్ ఇన్‌ఫార్మర్ నివేదిక ప్రకారం.. పాము గుడ్లు తినడం అనే ఆలోచన కొంత మందికి వింతగా అనిపించవచ్చు. పాము గుడ్లను సరిగ్గా ఉడికించి తినవచ్చు. ఇది సాధారణ కోడి గుడ్డుకు, పాము గుడ్డుకు తేడా ఉండదు. కోడి గుడ్ల మాదిరిగానే, పాము గుడ్లు కూడా పోషకాలతో కూడి ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పాము గుడ్లు విషపూరితమైనవి కావు. కానీ.. సరిగ్గా ఉడికించకుండా తింటే కడుపు సమస్యలకు దారి తీస్తుంది. విషపూరిత పాముల గుడ్లు కూడా విషపూరితమైనవి కావు. విషపూరిత పాము గుడ్డు తింటే ఆ విషం మీ కడుపులో అదనపు ప్రోటీన్‌గా కలిసిపోతుంది. కానీ.. ఇదే గుడ్డును ఆమ్లెట్ వేసుకుని తినడంపై ఎవ్వరూ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.
READ MORE: Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఆసియా కప్ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ ఇదే
వియత్నాంలో పాములు చాలా ప్రసిద్ధ రుచికరమైన వంటకం. పామును వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కామోద్దీపన (శృంగార సామర్థ్యం పెరగడం)కు సహాయపడుతుందని భావిస్తారు. పాము మాంసంతో అనేక వంటకాలను తయారు చేస్తారు. పాము గుడ్లను కూడా వండుకుని తింటారు. థాయిలాండ్‌లో పాములను రుచికరమైన భోజనంగా భావిస్తారు. రాట్ స్నేక్స్, కోబ్రాస్ తో అత్యంత రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. పాము సూప్ అనేది చైనాలో ఒక సాంప్రదాయ భోజనం. జపాన్‌లో సాంప్రదాయ సూప్ తయారు చేయడానికి అత్యంత విషపూరితమైన సముద్ర పాములను ఉపయోగిస్తారు.
నోట్: పైన పేర్కొన్న సమాచారాన్ని వివిధ వెబ్‌సైట్ల ద్వారా తీసుకున్నాం. ఈ వాదనకు సంబంధించిన వైల్డ్‌లైఫ్ ఇన్‌ఫార్మర్ నివేదికకు సంబంధించిన చిత్రాన్ని పైన ఉంచుతున్నాం. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు ట్రై చేయొద్దు. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
