Twins With Different Dads: సాధారణంగా కవలలుకు ఒకరే తండ్రి ఉంటారు. అది అందరికి తెల్సిన విషయమే. కానీ ఇద్దరు కవలలకు ఇద్దరు తండ్రులు ఉండడం ఎక్కడైనా చూశారా..? పోనీ ఎప్పుడైనా విన్నారా..?. వైద్య శాస్త్రంలోని అరుదైన ఘట్టంగా నిలిచింది ఈ ఘటన. సుమారు మిలియన్ కేసులో ఒకటి ఇలా ఉంటుందట. తాజాగా ఈ ఘటన బ్రెజిల్ లో వెలుగుచూసింది. ఒక 19 ఏళ్ల యువతీ ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ ఇద్దరు కవలలకు ఇద్దరు వేరువేరు తండ్రులని డీఎన్ఏ ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయారు వైద్యులు. అయితే ఇదెలా సాధ్యం అని వైద్యులు పుస్తకాలను తిరగేయగా.. రేర్ కేసుల్లో ఇలా జరుగుతుందని, ఒకే రోజు ఇద్దరు వ్యక్తులతో శృంగారంలో కండోమ్ లేకుండా పాల్గొంటే ఇలా జరిగే అవకాశం ఉందని తేల్చేశారు.
స్పృహలోకి వచ్చాకా ఆ యువతిని అడుగగా ఆమె కూడా ఇదే చెప్పుకొచ్చింది. “నేను ఆరోజు వేరొక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్నాను. ఆ తరువాత నాకు ప్రెగ్నెన్సీ అని తెలియడంతో అతడితోనే హాస్పిటల్ కూడా వెళ్లాను. అయితే నాకు తెలియదు ఇలా జరుగుతుందని, ఇద్దరు పిల్లలు వారి తండ్రుల పోలికతోనే ఉన్నారు” అని చెప్పుకొచ్చింది.ఇక ఆమెకు సర్జరీ చేసిన వైద్యులు మాట్లాడుతూ “ఒకే తల్లి నుండి రెండు గుడ్లు వేర్వేరు పురుషులచే ఫలదీకరణం చేయబడినప్పుడు ఇది సాధ్యమే. పిల్లలు తల్లి యొక్క జన్యు పదార్థాన్ని పంచుకుంటారు, కానీ అవి వేర్వేరు అండాలలో పెరుగుతాయి” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త బ్రెజిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
