Site icon NTV Telugu

Security Guard Saves Child: వామ్మో.. లిఫ్ట్ మధ్య ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లబోయిన చిన్నారి.. కాపాడిన సెక్యూరిటీ గార్డ్..

Untitled Design (5)

Untitled Design (5)

వామ్మో! ఓ చిన్నారి లిఫ్ట్ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లబోయింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ పాపను గమనించి తక్షణమే రక్షించాడు. కొంచెం ఆలస్యమైతే, చిన్నారి లిఫ్ట్ మధ్యభాగంలోకి పడిపోబోయేది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

తరచుగా వార్తలలో ఇలాంటి ఘటనలు విన్నా, నిజానికి ఇది చాలా భయంకర పరిస్థితి. ఈ సంఘటన ద్వారా సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తత, చిన్నారి రక్షణలో తీసుకున్న తక్షణ చర్య స్పష్టంగా కనిపిస్తుంది. ఓ చిన్నారి లిఫ్ట్ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లేస్ లోకి వెళుతుండగా అక్కడ ఉన్న గార్డ్ గమనించాడు. వెంటనే పాపను అందుకుని రక్షించాడు. లేకపోతే చిన్నారి ప్రాణాలు దక్కుండేవి కావు.

డిసెంబర్ 21న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా మంది చూసిన నెటిజన్లు సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Exit mobile version