Site icon NTV Telugu

Friendship: క‌ల్మ‌షంలేని స్నేహం… ఇదేక‌దా జీవితం…

స్నేహం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చిన్న‌త‌నం నుంచే స్నేహ‌బాంధ‌వ్యాల‌ను మెరుగుప‌రుచుకోవాలి. అప్పుడే స్నేహం యొక్క గొప్ప‌ద‌నం తెలుస్తుంది. స్నేహానికి ధ‌నిక‌, పేద‌, వ‌ర్గ భేదాలు ఉండ‌వు. ఎవ‌రితోనైనా, ఎప్పుడైనా స్నేహం చేయ‌వ‌చ్చు. అయితే, ఆ స్నేహం ఎన్నిరోజులు ఉంటుంది. ఎలా ఉంటుంది అన్న‌ది ముఖ్యం. దీనిక ఓ చిన్న ఉదాహ‌ర‌ణ ఇదే. సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర కారు ఆగిన‌పుడు, అద్దాలు తుడుస్తూ వారు ద‌య‌తో ఇచ్చిన డ‌బ్బుల‌తో జీవ‌నం సాగించే ఓ బాలుడు ఎప్ప‌టిలాగే త‌న జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నాడు.

Read: Mallannasagar: మ‌ల్లన్న సాగ‌ర్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు…

ఓ కారు అద్దాన్ని తుడిచిన త‌రువాత కారులో ఉన్న వ్య‌క్తుల‌ను చేయి చాచి డ‌బ్బులు అడిగాడు. కానీ, అనూహ్యంగా కారులో ఉన్న ఓ బాలుడు ఆడుకునే బొమ్మ‌ను అందించాడు. ఖ‌రీదైన ఆ బొమ్మ త‌న‌కు వ‌ద్ద‌ని చెప్పాడు. కానీ, కారులో ఉన్న బాలుడు తీసుకోమ‌ని చెప్ప‌డంతో ఆనందంతో త‌బ్బుబ్బిపోయాడు. వెంట‌నే ప‌రిగెత్తుకువెళ్లి చిప్స్ ప్యాకెట్ తెచ్చి కారులోని బాలుడికి అందించాడు. ఆ త‌రువాత ఇద్ద‌రు ఆ ప్యాకెట్‌లోని చిప్స్ ను తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.

Exit mobile version