యూరప్‌ను ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. యూనిస్ తుఫాను కారణంగా యూరప్‌లోని అనేక దేశాలు వణికిపోతున్నాయి. 190 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో కార్లు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. రోడ్డుమీదకు వచ్చిన మనుషులు గాలికి తట్టుకోలేకి రోడ్డుమీదనే పడిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, దేవాన్‌లోని బర్నస్టాపల్‌లోని ఓ కారు పార్కింగ్ వద్ద సిమన్ అనే వ్యక్తి నిలబడి ఉన్నాడు. అయితే, హటాత్తుగా ఈదురుగాలులు వీయడంతో సిమన్ విగ్గుకాస్త ఎగిరిపోయింది. హటాత్తుగా జరిగిన ఆ పరిణామంతో సిమన్ షాక్ అయ్యాడు. ఎగిరిపోయిన విగ్గును పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. చివరకు ఎట్టకేలకు విగ్గును పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Read: NASA Perseverance Rover: మార్స్‌పై విజయవంతంగా ఏడాది పూర్తి…
