Odisha Election Results: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. బీజేడీ అధికారానికి బ్రేకులు పడ్డాయి. 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల భాజపా విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమనం చేసుకుంది. దీంతో ఆరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి రికార్డు సాధించాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఈసారి ముఖ్యమంత్రి “నవీన్ పట్నాయక్” మళ్ళీ సిఎం కాకపోతే, నేను రాజకీయాల నుండి సన్యాసులను తీసుకుంటానని నేను గట్టిగా చెబుతున్నాను” అని వీకే పాండియన్ (V.K. Pandian) అన్నారు. గతంలో జార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. ఇప్పుడు ఆమాటకి కట్టుబడి ఉంటారా లేదా అని ఆసక్తిరేపుతుంది..