NTV Telugu Site icon

Viral Video: కదులుతున్న కారుపై నిద్రిస్తున్న పిల్లలు.. డైవర్ పై మండిపడుతున్న నెటిజన్లు..

Caar

Caar

సోషల్ మీడియా పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పానక్కలేదు.. క్రేజ్ కోసం కొందరు.. మంచి కోసం మరికొందరు దీన్ని తెగ వాడేస్తున్నారు.. అయితే నిత్యం ఏదోక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా మరో వణుకు పుట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. చిన్న పిల్లల పట్ల డ్రైవర్ నిర్లక్ష్యం పై దుమ్మేత్తి పోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

రోడ్డు పై కారుపై ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు కారుపై నిద్రిస్తున్నారని కారు డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు వారించినా బేఖాతరు చేయకపోవడం దుమ్మేత్తి పోస్తున్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో వీడియోను చూసిన నెటిజన్లు డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన గోవాలో చోటు చేసుకుంది. గోవాలోని మాపుసా పట్టణ సమీపంలో కదులుతున్న ఓ కారుపై ఇద్దరు చిన్నారులు ప్రమాదకర రీతిలో నిద్రిస్తూ కనిపించారు..

పక్కన వెళుతున్న కొందరు వాహన దారులు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు.. కారుపై చిన్నారులు పడుకొని ఉండటంపై.. వీడియో తీస్తున్న వ్యక్తి డ్రైవర్‌ను ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పకుండా డ్రైవింగ్‌ను కొనసాగిస్తూ ముందుకు వెళ్లిపోయాడు. వెళ్లిపోవడం గమనార్హం. ఈ వీడియో డిసెంబర్‌ 27న పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో సదరు టూరిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కారు నెంబర్ ను చూస్తే అది తెలంగాణది లాగా ఉంది.. ఇది పిల్లలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. సాధారణంగా అనిపించినా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.. పోలీసులు ఇలాంటివారిని అసలు వదిలి పెట్టకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.. వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..