Stock Market Highlights: డాలర్‌తో పోల్చితే మన కరెన్సీ రూపాయి మారకం విలువ 82 దాటింది. ఇది స్టాక్ మార్కెట్లకు ఏమాత్రం సానుకూల పరిణామం కాదు. దీనికితోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికం (సెప్టెంబర్‌తో) ముగియటంతో టీసీఎస్, టాటా ఎలక్సీ వంటి కంపెనీలు తమ పనితీరును, ఆర్థిక ఫలితాలను సోమవారం నుంచి వరుసగా వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో వచ్చే వారం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది ఆసక్తికరంగా మారింది.
దీనికితోడు గతవారం స్టాక్ మార్కెట్లు ఎలాంటి పెర్ఫార్మెన్స్‌ను కనబరిచాయనేది కూడా విశ్లేషించుకోవాలి. నిన్న శుక్రవారం ఇండియన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు చాలా వీక్‌గా క్లోజ్ అయ్యాయి. పోయిన వారం మార్కెట్లు.. పైకి దూసుకెళ్లాయి గానీ ఎక్కువ సేపు సస్టెయిన్ కాలేకపోయాయి. నిఫ్టీతోపాటు డౌజోన్స్‌కి సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. డౌజోన్స్ చార్ట్ బేరిష్‌గా డౌన్ అయింది. నిఫ్టీ ఒకానొక దశలో 17400 పైనే ట్రేడింగ్ అయి నిన్న 17300 వద్ద ముగిసింది. వచ్చే వారం వెలువడనున్న పలు కంపెనీల రిజల్ట్స్ ఆశాజనకంగా ఉంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ల ఔట్ పెర్ఫార్మెన్స్ కొనసాగే అవకాశం ఉంది.
ఫలితాలు గనక ఆశించిన స్థాయిలో లేకపోతే స్టాక్స్ డౌన్ సైడ్ కరెక్షన్‌కి లోనవుతాయి. నిఫ్టీ 16800 పాయింట్ల కన్నా దిగువకు పడిపోయే అవకాశం లేదని నిపుణులు ఆశిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ సైతం గతవారం 17,500 లెవల్స్ నుంచి బౌన్స్ అయి 39,800 లెవల్స్ వద్ద టెస్ట్ చేసి శుక్రవారం 39000 వద్ద క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఇలాంటి మరిన్ని విలువైన, ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను తెలుసుకోవాలంటే ‘వెల్త్ ట్రీ గ్రూప్’ ఫౌండర్, సీఈఓ ప్రసాద్ దాసరి ‘ఎన్-బిజినెస్’కి ఇచ్చిన ‘ఫిన్‌టాక్’ చూడొచ్చు. ఆ వీడియో లింక్ ఈ కిందే ఉందని గమనించగలరు.
