NTV Telugu Site icon

Stock Market Fundamentals: స్టాక్‌ మార్కెట్లలో డబ్బు పోగొట్టుకోకుండా ఉండటానికి నేర్చుకోవాల్సిన ఫండమెంటల్స్‌

Iuvzc Yacxi Hd

Iuvzc Yacxi Hd

Stock Market Fundamentals: స్టాక్‌ మార్కెట్లలో డబ్బును పోగొట్టుకోకుండా ఉండాలంటే ముఖ్యంగా రెండు సబ్జెక్టులను స్టడీ చేయాలి. 1. ఫండమెంటల్‌ అనాలసిస్‌. 2. టెక్నికల్‌ అనాలసిస్‌. ఫండమెంటల్‌ అనాలసిస్‌లో ఈఐసీ అప్రోచ్‌ ప్రధానమైంది. ఈ అంటే ఎకానమిక్‌, ఐ అంటే ఇండస్ట్రీ, సీ అంటే కంపెనీ. ఎకానమీ విషయానికి వస్తే ప్రతి దేశాన్ని ఒక ఎకానమీగా భావించాలి. అయితే.. ముందుగా ఆ ఎకానమీ గ్రోయింగ్‌/రిసెషన్‌/సంప్‌/రికవరీ ఎకానమీల్లో దేని కిందికి వస్తుందో చూడాలి.

ప్రతి దేశానికి ఒక ఎకానమిక్‌ సైకిల్‌ ఉంటుంది. ఆ సైకిల్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. గ్రోత్‌ నుంచి రిసెషన్‌లోకి వెళుతుంది. రిసెషన్‌ నుంచి సంప్‌లోకి పడిపోతుంది. దీనికి ఉదాహరణ శ్రీలంక. ఆ దేశంలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని దేశాలు అలాంటి స్థితి నుంచి కూడా గ్రోత్‌లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక దేశంలోని కంపెనీలన్నీ ఆ దేశ ఎకానమిక్‌ ఎన్విరాన్‌మెంట్‌కి అనుగుణంగా ఉంటాయి. ఎకానమీని టాప్‌ టు బోటమ్‌, బోటమ్‌ టు టాప్‌ అనే రెండు విధాలుగా విశ్లేషించొచ్చు.

ఒక ఎకానమీలో ఎన్నో సెక్టార్లు(ఇండస్ట్రీలు), ఒక ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కాబట్టి ఎకానమీ గురించి ఓవరాల్‌గా తెలుసుకున్నాక సెక్టార్‌ గురించి స్టడీ చేయాలి. అనంతరం ఆ ఇండస్ట్రీలోని వివిధ కంపెనీల పనితీరును పరిశీలించాలి. తద్వారా ఆయా సంస్థల షేర్ల పెర్ఫార్మెన్స్‌పై అవగాహన వస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు టాప్‌ టు బోటమ్‌ అప్రోచ్‌నే ఫాలో అవుతారు. ఇందులోనే ఎక్కువ అనాలసిస్‌కి అవకాశం ఉంటుంది. ఎకానమీలో జీడీపీ గ్రోత్‌, ఇన్‌ఫ్లేషన్‌, ఇంట్రస్ట్‌ రేట్లు, ఎఫ్‌డీఐలు, డొమెస్టిక్‌ ఇన్వెస్టర్లు, ఇంపోర్ట్స్‌, ఎక్స్‌పోర్ట్స్‌ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతుంది?. ఇన్‌ఫ్లేషన్‌ని, గ్రోత్‌ని ఎలా మ్యానేజ్‌ చేయాలి?. దీనికోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనేవి ఆసక్తికరంగా ఉంటాయి. ఇంట్రస్ట్‌ రేట్స్‌ను ఎందుకు పెంచుతారు? ఎందుకు తగ్గిస్తారు? గ్రోత్‌ ఎక్కువ ఉంటే ఇన్‌ఫ్లేషన్‌ ఎలా ఉంటుంది? జనాల దగ్గరికి మనీ ఎక్కువగా వెళ్లినప్పుడు ఏమవుతుంది? ప్రస్తుతం మన ఎకానమీ ఏ స్టేజ్‌లో ఉంది?, మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి? ఇంటర్నేషనల్‌గా క్రూడాయిల్‌ రేట్లు పెరిగితే ఇండియాలో ఇన్‌ఫ్లేషన్‌ పెరుగుతుందా? తగ్గుతుందా? దీని ప్రభావం బడ్జెట్‌ మీద, ద్రవ్యలోటు పైన ఎలా ఉంటుంది? మన దేశంలో ఇప్పుడు ఏయే రంగాల పైన ప్రభుత్వం, ప్రజలు ఫోకస్‌ పెడుతున్నారు?

ఇలాంటి ఎన్నో విలువైన స్టాక్‌ మార్కెట్‌ బేసిక్‌ పాఠాలను ‘వెల్త్‌ ట్రీ గ్రూప్‌’ ఫౌండర్‌ సీఈఓ ప్రసాద్‌ దాసరి ‘ఎన్‌-బిజినెస్‌ ఫిన్‌ టాక్‌’లో చక్కగా వివరించారు. ఆ వీడియో పైనే ఉంది. ఆసక్తి కలిగినవారు చూసి నేర్చుకోవచ్చు.