తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు గుడ్ న్యూస్.. మరో మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించనున్నాయి. దీంతో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాపాతం నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే ఏపీలో ప్రవేశిస్తున్నాయి. అయితే, మే31వ తేదీ నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నాయి. అక్కడి నుంచి దక్షణ భారతదేశం మీదుగా ఉత్తరం వైపుకు ప్రయాణిస్తాయి. ఈసారి జూన్ 1, 2 తేదీల్లో ఏపీలో ప్రవేశించనున్నాయి. ఆలస్యం జరిగిన మరుసటి రోజే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెప్పారు. రెమాల్ తుఫాన్ కూడా బంగ్లాదేశ్ వైపు కదిలిపోవడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతవరణం ఏర్పాడింది.