NTV Telugu Site icon

Janvikapoor : పురివిప్పిన నెమలిలా జాన్వీ ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో చూశారా?

Janvi Dance

Janvi Dance

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తెలియనివాళ్లు ఉండరు.. సినిమాలు తక్కువ చేసిన అనతికాలంలోనే మంచి పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఈ అమ్మడుకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటుంది… టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది..ఇక సోషల్ మీడియాలో జాన్వీ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా అదిరిపోయే డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ వీడియోలో పింక్ డ్రెస్సులో పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నట్లు అదిరిపోయే డ్యాన్స్ చేసింది.. ఆ డ్యాన్స్ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు డ్యాన్స్ ను చూసి ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం ఆ డ్యాన్స్ వీడియో ట్రెండ్ అవుతుంది. ఇక దేవర సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అంతేకాకుండా రాంచరణ్ హీరోగా చేస్తున్న ఆర్ సి 16 మూవీలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

అలాగే తెలుగులో మూడో సినిమాలో కూడా అవకాశం పట్టేసిందని టాక్ . మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్త వైరల్ అవుతుంది. డార్లింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే కనుక నిజమైతే జాన్వీ తెలుగులో అతి తక్కువ కాలంలో ముగ్గురు స్టార్ హీరోలతో చేసి స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా అని సినీ అభిమానులు చెబుతున్నాయి..

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Show comments