Site icon NTV Telugu

Couple Buys Mobile with Coins: చిల్లర పైసలతో మొబైల్ కొనేందుకు వచ్చిన వృ‌ద్ధ దంపతులు.. మానవత్వం చూపిన యజమాని..

Untitled Design (4)

Untitled Design (4)

చిల్లర పైసలతో మొబైల్ కొనడానికి వచ్చిన వృద్ధ దంపతులను చూసిన యజమాని మానవత్వాన్ని ప్రదర్శించాడు. వారికి తక్కువ ధరకే ఫోన్ ఇవ్వడమే కాకుండా బహుమతి కూడా ఇచ్చి గౌరవించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే వ్యాపారం అంటే కేవలం లాభాల వేట మాత్రమేనని ఆలోచిస్తుంది నేటి కాలం. ఇలాంటి పరిస్థితుల్లోనూ అన్నింటికంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. అలాంటి వారు తమకు ఎదురైన పేదల పట్ల, డబ్బులేని వారి పట్ల తమ మానవత్వాన్ని చూపుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వృద్ధ పేద దంపతులు మొబైల్ కొనేందుకు షాపుకు వెళ్లారు. అక్కడ వారు ఒక సాధారణ నోకియా ఫోన్‌ను అడిగారు. అయితే యజమాని వారికి ఫోన్ చూపించారు. అందుకోసం వారు చీర కొంగులో కట్టుకున్న కొన్ని నాణేలను తీసి కౌంటర్‌లో ఉంచి దుకాణదారుడి వైపు నిరాశగా చూస్తుంది. వారి భావాలను చూస్తే దుకాణదారుడు తమను తిడతాడేమో లేదా బయటకు పంపిస్తాడేమో అని అనుకున్నారు. కానీ అలా చేయకుండా.. వారి ఇచ్చిన చిల్లర పైసలు(నగదు) తీసుకుని వారికి మొబైల్ ప్యాక్ చేసి ఇచ్చేసాడు. అంతేకాకుండా వారికి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి గౌరవించాడు. దీంతో ఆ జంట ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే లక్షలాది మంది దీనిని చూశారు. ప్రతి ఒక్కరూ షేర్‌ చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ఇది మానవత్వానికి ఉదాహరణగా చెబుతున్నారు. వినియోగదారులు దుకాణదారుడి మానవీయతను ప్రశంసించారు.

Exit mobile version