NTV Telugu Site icon

హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానే : వైసీపీ ఎమ్మెల్యే

అంబులెన్సులు టీఎస్ ఆపటంపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.  టీఎస్ ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సామినేని కీలక వ్యాఖ్యలు చేసారు. అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని టీఎస్ పోలీసులను కోరాం. హెల్త్ ఎమెర్జెన్సీలో తీవ్ర సంక్షోభంలో ఉన్నాము. మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకోవచ్చు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధాని. ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది అని అన్నారు. కామన్ రాజధాని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అంబులెన్స్ లు ఆపటం అనైతికం. తెలంగాణ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించాలి. విడిపోయిన రాష్ట్రం మద్రాస్ కు వైద్యం కోసం వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నా అని చెప్పిన ఆయన మనం అందరం ముందు భారతీయులం అని పేర్కొన్నారు.