నేటి నుండి 10 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల నుండి యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనారసింహ స్వామి కొలువైఉన్న యాదగిరిగుట్టలో లాక్‌డౌన్ విధించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. నేటి నుంచి పది రోజులపాటు అమల్లో ఉండనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారులు తమ వ్యాపార కలాపాలు కొనసాగించుకోవచ్చని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధ వెల్లడించారు. లాక్‌డౌన్ నుంచి పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణం, మెడికల్ షాపులు మినహాయింపు ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.