ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ నేత టీ.ఆర్.ఎస్ నేత మాధవి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఖమ్మం మున్సిపాలిటీ లో పాలేరు సగం ఉంది కాబట్టి కలిసికట్టుగా పని చేయాలి. ఈ రోజు నాగార్జున సాగర్ పోలింగ్ నడుస్తోంది. సాగర్ లెక్కింపు కంటే ముందే సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలను రాజకీయ దురుద్దేశంతో పెట్టించారు. సాగర్ ఫలితం విరుద్ధంగా వస్తుందని ముందే పోలింగ్ పెట్టించారు. స్టేట్ ఎలక్షన్స్ కమిషనర్ ఏం చేస్తున్నారు.. కరోనా ఇంతగా విజృంభిస్తోంటే .. ఎన్నికలు అవసరమా అని అన్నారు. రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా.. అధికారులు కూడా వత్తాసు పలకడం సిగ్గుచేటు. కరోనా తో హాస్పిటల్ లో బెడ్స్ లేవని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రే చెప్పారు. ఈ ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు కూడా ఏమనకపోవడం దురదృష్టకరం అని అన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన మున్సిపల్ లో విజయం సాధిస్తాం. నాగార్జున సాగర్ లో కూడా జానారెడ్డి గెలవబోతున్నారు అని పేర్కొన్నారు.