NTV Telugu Site icon

ఇళ్ల మధ్యలో పబ్‌ల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ

ఇళ్ల మధ్యలో పబ్‌ల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ2
రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌ల నిర్వహణపై ఓ ఎన్జీఓ సంస్థ, అనుబంధ పిటిషన్లను ఈ రోజు హైకోర్టు విచారించింది. ఇళ్ళ మధ్యలో పబ్‌లు ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ పొల్యుషన్ తో పాటు, సౌండ్ పొల్యుషన్ ఎక్కువైందంటు కోర్టుకు తెలిపిన పిటిషనర్లు. ఇళ్ల మధ్యలో పబ్‌ల వద్ద ట్రాఫిక్, నాయిస్ పొల్యూషన్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హై కోర్టు. పబ్‌ల వద్ద న్యూసెన్స్ ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

శబ్ద కాల్యుషం, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం దగ్గర ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. యాక్షన్ ప్లాన్ వివరాలు ఇచ్చేందుకు హైకోర్టును సమయం కోరిన అడిషనల్ ఏజీ. దీనిపై సమయం ఇవ్వడం కుదరదు.. రేపటిలోగా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు. నూతన సంవత్సర వేడుకలకు ముందే వివరాలు చెప్పాలని హై కోర్టు ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.