దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే తెలిపాడు. ”నా టీకా పూర్తయింది! మీరూ తీసుకోండి!! కరోనా సెకండ్ వేవ్ ప్రతి ఒక్కరినీ తీవ్రంగా దెబ్బతీసింది. టీకా తీసుకోవడం ఒక్క గంట పని మాత్రమే. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మే 1న వ్యాక్సిన్ తీసుకోండి” అని ట్విట్ చేసాడు సూపర్ స్టార్. అయితే వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా వచ్చే నెల 1 నుండి 18 ఏళ్ల పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే.