ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మొద్దత బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ ప్రత్యర్థులను ఆల్ ఔట్ చేసింది. వరుస వికెట్లు తీస్తూ పంజాబ్ ను దెబ్బ కొట్టి 120 పరుగులకే కట్టడి చేసారు హైదరాబాద్ బౌలర్లు. ఇక 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన సన్‌రైజర్స్ ఆచి తూచి ఆడింది. ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ను కొంచెం వేగంగా ప్రారంభించిన పవర్ ప్లే తర్వాత నెమ్మదించారు. కెప్టెన్ వార్నర్ 37 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్న విలియమ్సన్ తో కలిసి జట్టుకు విజయాన్ని అందించారు బెయిర్‌స్టో. ఈ క్రమంలోనే తన అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. దాంతో పంజాబ్ కింగ్స్ పైన 9 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్ లో మొదటి విజయం నమోదు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.