రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బుధవారం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ ను ప్రముఖ దర్శకుడు శంకర్ సందర్శించారు. రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నదియా కీలక పాత్రను పోషిస్తున్నారు. సెట్ కి వచ్చిన శంకర్ హీరో రామ్, దర్శకుడు లింగు స్వామితో పాటు యూనిట్ మెంబర్స్ తో సంభాషించారు. ఈ విషయమై శంకర్ కి ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ.
రామ్, లింగుస్వామి సెట్ లో డైరెక్టర్ శంకర్
