ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ జట్టుకు రాయల్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ మొదట్లోనే షాక్ ఇచ్చాడు. వేసిన మొదటి మూడు ఓవర్లలో ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ అలాగే అజింక్య రహానే ను పెవిలియన్ కు పంపించాడు. కానీ ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్ పంత్(51) అర్ధశతకంతో రాణించడంతో స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. కానీ పంత్ ఔట్ అయిన తర్వాత అందరూ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కట్ 3 వికెట్లు తీయగా ముస్తాఫిజుర్ 2 వికెట్లు క్రిస్ మోరిస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవాలంటే 148 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.