Site icon NTV Telugu

ఐపీఎల్ 2021 : రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతను బాగానే కట్టడి చేసారు రాజస్థాన్ బౌలర్లు. మొదటి నుండు కట్టుదిట్టమైన బంతులు సంధిస్తూ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ కు పరుగులు చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అయితే మధ్యలో రాహుల్ త్రిపాఠి(36), దినేష్ కార్తీక్ (25) కొంత భాగసౌమ్యని నెలకొల్పోయిన చివర్లో రాయల్స్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది నైట్ రైడర్స్. ఇక రాయల్స్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లు తీయగా జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే రాయల్స్ 134 పరుగులు చేయాలి. చూడాలి మరి రాజస్థాన్ ఏం చేస్తుంది అనేది.

Exit mobile version