Site icon NTV Telugu

ఏపీ సీఎం జగన్ కు ప్రధానమంత్రి ఫోన్…

ఏపీ సీఎం జగన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసారు.  రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, నియంత్రణ పై సీఎం జగన్ తో చర్చించారు ప్రధాని.  ఏపీతో పాటు తెలంగాణ, ఒరిస్సా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ లతోనూ మాట్లాడాడు మోదీ. అయితే కోవిడ్‌ వైరస్‌ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించిన సీఎం, పీఎమ్.. కోవిడ్‌ వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను,  వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రధానికి వివతించాడు ముఖ్యమంత్రి జగన్. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచి, కోవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్నామని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని మోదీకి సీఎం జగన్ తెలిపారు.

Exit mobile version