విశాఖ నగరంలో మెడికల్ షాపులు కిటకిటలాడుతోన్నాయి. మెడికల్ షాపుల ముందు బారులు తీరుతోన్నారు విశాఖ వాసులు. కొద్దిపాటి లక్షణాలు.. హోం ఐసోలేషనులో ఉన్న వారి కోసం మందులు కొనుగోళ్లకు రోడ్లపైకి వస్తున్నారు విశాఖ ప్రజలు. ఫాబి ఫ్లూ వంటి టాబ్లెట్లకు కొన్ని రకాల బ్రాండ్లల్లో కొరత ఉంటుంది అని మెడికల్ షాప్ ఓనర్లు. అయితే విశాఖలో ఆక్సీ మీటర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయితే ఏపీలో ఈ కరోనా సెకండ్ వేవ్ లో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో అక్కడ కరోనా నియమాలు, ఆంక్షలు కఠినంగా అమలు పరుస్తుంది ప్రభుత్వం.